గ్రహం అనుగ్రహం (09-06-2020) | Daily Horoscope in Telugu (09-06-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (09-06-2020)

Jun 9 2020 5:31 AM | Updated on Jun 9 2020 5:31 AM

Daily Horoscope in Telugu (09-06-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.చవితి రా.9.26 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఉత్తరాషాఢ సా.4.05 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం రా.8.13 నుంచి 9.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి రా.10.51 నుంచి 11.35 వరకు అమృతఘడియలు... ఉ.9.34 నుంచి 10.43 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

గ్రహఫలం.. మంగళవారం, 09.06.20
మేషం: కొత్త  కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు సంతోషకరమైన  వార్తలు.

వృషభం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

కర్కాటకం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్య: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

తుల: అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో స్వల్ప వివాదాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.

వృశ్చికం: దూరపు బంధువులు సహాయపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

ధనుస్సు: శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అదనపు రాబడి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.

కుంభం: దూరప్రయాణాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.

మీనం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి.ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలోఅంచనాలు నిజమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement