గ్రహం అనుగ్రహం (03-01-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (03-01-2020

Published Fri, Jan 3 2020 5:57 AM

Daily Horoscoe in Telugu (03-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, పుష్యమాసం, తిథి శు.అష్టమి రా.9.03 వరకు, తదుపరి నవమి, నక్షత్రం రేవతి పూర్తి (24గంటలు), వర్జ్యం రా.7.03 నుంచి 8.49 వరకు, దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.32 వరకు, తదుపరి ప.12.28 నుంచి 1.12 వరకుఅమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదురవుతాయి.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వస్తు, వస్త్రలాభాలు. ధనలబ్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు.

కర్కాటకం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత భారంగా ఉంటాయి.

సింహం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

తుల: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: విచిత్ర సంఘటనలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement