గ్రహం అనుగ్రహం (12-12-2019)

Daily Hororscope in Telugu (12-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి పౌర్ణమి ఉ.10.49 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం రోహిణి ఉ.7.08 వరకు, తదుపరిమృగశిర, వర్జ్యం ప.12.49 నుంచి 2.25 వరకు, దుర్ముహూర్తం ఉ.8.35 నుంచి 9.19 వరకు, తదుపరి ప.2.26 నుంచి 3.10 వరకు, అమృతఘడియలు... రా.10.32 నుంచి 12.09 వరకు.

సూర్యోదయం :    6.24
సూర్యాస్తమయం    :  5.23
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం:  సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.

మిథునం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

సింహం: నిరుద్యోగులకు కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య: అనుకున్న పనుల్లో అవాంతరాలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

తుల: రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మికచింతన. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృశ్చికం: బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడతారు.

మకరం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా బాధ్యతలు.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.బంధుమిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top