‘వైఎస్సార్‌సీపీదే అధికారం’

YSRCP Will Form The Government Say Ball Durga Prasad - Sakshi

సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం ఎదురుచూస్తున్నారని తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ అన్నారు. ప్రజల మనోగతాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 125 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజల్ని, అధికారుల్ని భయపెట్టారని, కానీ ప్రజలంతా వైఎస్సార్‌సీపీకి ఓటువేసే బాధ్యతను తీసుకున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వేలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top