చెరకు రైతుల కోసం వైఎస్‌ఆర్ సీపీ ధర్నా | ysrcp to be held protest for sugar farmers | Sakshi
Sakshi News home page

చెరకు రైతుల కోసం వైఎస్‌ఆర్ సీపీ ధర్నా

Dec 1 2014 9:38 AM | Updated on May 25 2018 9:17 PM

చెరకు రైతుల కోసం వైఎస్‌ఆర్ సీపీ ధర్నా - Sakshi

చెరకు రైతుల కోసం వైఎస్‌ఆర్ సీపీ ధర్నా

చెరకు రైతులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్లుగా రూ.17.12 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంపై చెరకు రైతు మండిపడుతున్నాడు. క్రషింగ్ సీజన్ ప్రారంభమైనా సర్కారు మద్దతు ధర ప్రకటించకపోవడం వల్ల ప్రైవేటు పరిశ్రమలు దోపిడీ చేస్తుండడాన్ని రైతు జీర్ణించుకోలేక పోతున్నాడు. చెరకు రైతులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది.

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యంలోని ఎస్వీ షుగర్స్ ఎదుట సోమవారం  ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులురాలు ఆర్కే రోజా, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement