కులవృత్తికి దన్ను

Ysrcp Supporting Gold Smiths - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం  (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): స్వర్ణకారులు.. వీరి పేరులో స్వర్ణం ఉన్నా జీవితాల్లో మాత్రం చీకట్లు అలముకున్నాయి. కార్పొరేట్‌ సంస్థల ఆగమం, రెడీమేడ్‌ వస్తువులకు గిరాకీ పెరగడంతో స్వర్ణకార వృత్తి రోజురోజుకూ తగ్గుతోంది. చేతినిండా పనిలేకపోవడంతో చాలామంది స్వర్ణకారులకు పూట గడవడటం కష్టంగా మారింది. వృత్తిపరంగానూ వీరు చాలా ఒడుదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కారుచీకట్లలో కాంతిరేఖలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనిపిస్తున్నారు. స్వర్ణకారుల కష్టాలు దగ్గరనుంచి తెలుసుకున్న ఆయన విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఎందరో స్వర్ణకారుల దీనగాథలు తెలుసుకున్న ఆయన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ హామీ వేలాది మంది స్వర్ణకారుల్లో ఆనందం నింపింది. 

కార్పొరేట్‌ మాయాజాలం, రెడీమేడ్‌ ఆభరణాలు మార్కెట్‌లోకి విరివిగా వస్తుండటంతో స్వర్ణకారుల కొలిమిలో నిప్పు రాజకోవడం గగనమైపోతుంది. బంగారు ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వస్తువులను మెరుగు పెట్టించుకునేందుకు వీరి వద్దకు వస్తుండటంతో చేతినిండా పనులు లేక  పస్తువులు ఉంటున్నారు. కుటుంబ పోషణ, దుకాణాల అద్దెల చెల్లింపులు గగనమైపోతున్నాయి. వారి కష్టాలు తీర్చేందుకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో స్వర్ణకారులకు కొండత భరోసా ఇచ్చినట్టయ్యింది. దీంతో వీరంతా రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అని  అంటున్నారు. రానున్న ఎన్నికల్లో తామంతా మీవెంటే అని నినదిస్తున్నారు. 

కొండంత ధైర్యం వచ్చింది
స్వర్ణకారులు అందరూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో స్వర్ణకారుల ఆవేదనను ఆయన విన్నారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో మాలో ధైర్యం వచ్చింది. వైఎస్సార్‌ స్ఫూర్తితో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. మేమంతా ఆయన వెంటే. 
–అకరిపల్లి మల్లికార్జున, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం 

కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలి
ప్రజాసంకల్ప యాత్రలో మా కష్టాలు విన్న జగన్‌ విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మా ఎదుగుదలకు కృషిచేస్తానన్నారు. చాలా ఆనందంగా ఉంది. మేం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశంగా భావిస్తున్నాం. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. 
–ఆవుపాటి సాయిప్రశాంత్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం 

రుణ సదుపాయం వస్తుంది
విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ వల్ల రుణ సదుపాయం వస్తుంది. ఆ«ధునిక యంత్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు తమ పరిస్థితిని పట్టించుకోలేదు. జగన్‌ మా సంఘీయులకు హామీ ఇవ్వడం సంతో షాన్ని కలిగిస్తుంది. స్వర్ణకారుల కష్టాలు తొలుగుతాయ ని నమ్ముతున్నాం. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. 
–పెట్ల రవిప్రసాద్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం 

యంత్రాలు సమకూర్చుకోవచ్చు 
విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడం శుభపరిణామం. విశ్వ బ్రాహ్మణులు సమస్యల సుడిగుండంలో ఉన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటైతే ఆధునిక యంత్రాలు సమకూర్చుకోవచ్చు. మరింత నైపుణ్యం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం కావచ్చు.  
–కొండెంపూడి శ్యామ్‌కుమార్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం 

విద్యుత్‌ రాయితీ ఇవ్వాలి
స్వర్ణకారులకు విద్యుత్‌ రాయితీ విషయమై పరిశీలన చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం సంతోషంగా ఉంది. విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు ఇస్తే ఆర్థికంగా కొంతవరకు గట్టు ఎక్కుతాం. స్వర్ణకారుల కష్టాలు చాలావరకు తొలుగుతాయని నమ్ముతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి అ«ధికారంలోకి రావడం ద్వారా లబ్ధి తప్పక వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. 
–సమతాని జెమిని శ్రీనివాస్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం

పని దొరకడం కష్టమైంది
రెడీమేడ్‌ ఆభరణాలతో సంప్రదాయ స్వర్ణకారులకు పని దొరకడం లేదు. వరలక్ష్మి రూపులు కూడా రెడిమేడ్‌ వచ్చేశాయి. చిన్నపాటి పనులు తప్ప పెద్ద పని ఎవరూ ఇవ్వడం లేదు. జగన్‌ హామీలు మాకు భరోసా ఇచ్చాయి.  
–లక్కోజు ధర్మేష్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top