రాష్ట్ర ప్రజలందరికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు.
ఢిల్లీ: రాష్ట్ర ప్రజలందరికి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్‌లోనే స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరికి సమన్యాయం చేయాలని తమ పార్టీ నిర్ణయం అని చెప్పారు.
కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్‌ను ఆదరించిన జనాన్ని విభజించి శిక్షించారని వారు పేర్కొన్నారు.