రాజేష్పై కావూరి దొంగ కేసులు పెట్టించారు: వైఎస్ఆర్సీపీ | YSRCP MLAs take on central minister kavuri over rajesh arrest | Sakshi
Sakshi News home page

రాజేష్పై కావూరి దొంగ కేసులు పెట్టించారు: వైఎస్ఆర్సీపీ

Dec 18 2013 6:36 PM | Updated on Aug 15 2018 7:45 PM

చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అరెస్టును వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.

చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అరెస్టును వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. అధికారులపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఒత్తిడి చేసి.. మద్దాల రాజేష్‌పై దొంగకేసులు పెట్టించారని, ఆయనను ఓ ఉగ్రవాది తరహాలో బంధించి మరీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కావూరి సాంబశివరావు సమైక్యాంధ్రకు ద్రోహం చేసినందుకే ప్రజలు ఆయనను నిలదీశారని, అలాంటి సమయంలో సమైక్యవాదులపై దాడులు చేయించడం కావూరికి తగదని ఎమ్మెల్యేలు అన్నారు.

కంపెనీల్లో అక్రమ పెట్టుబడుల కోసం కావూరి సమైక్యవాదాన్ని తాకట్టు పెట్టారని శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే మద్దాల రాజేష్పై కేసులు ఉపసంహరించి కావూరి క్షమాపణ చెప్పాలని, లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమైక్య ద్రోహులెవరికైనా ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement