మైనార్టీల సంక్షేమంపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్: మైనార్టీల సంక్షేమంపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని అడిగారు.
ఈ ప్రశ్నకు ఐటీ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. మైనార్టీలకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం విధివిధానాలు పరిశీలిస్తున్నామని మంత్రి శాసనసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగడంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలు అంశాలు సభలో లేవనెత్తారు. మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు.