
సాక్షి, వైఎస్సార్ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లను యుద్ధ భూమిలో కాకుండా ఉగ్రదాడి చేయటం దుర్మార్గమన్నారు. పిరికితనంతో చేసిన దాడిలో, విధినిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.