కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం: రోజా | ysrcp mla roja slams chandrababu naidu over mudragada padayagra | Sakshi
Sakshi News home page

కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం: రోజా

Jul 26 2017 12:57 PM | Updated on Oct 29 2018 8:10 PM

కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం: రోజా - Sakshi

కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం: రోజా

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

తిరుపతి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు సర్కార్‌ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోజా బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పరిస్థితి చూస్తుంటే మనం పాకిస్తాన్‌లో ఉన్నామా?...భారత్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది.

కాంగ్రెస్‌ పాలనలో చంద్రబాబు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారని, అప్పుడు ఇలానే వ్యవహరించి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేది.’ అని ప్రశ్నించారు. అలాగే డ్రగ్స్‌ కేసుపై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ‘సినీ నటులం అద్దాల మేడలో ఉన్నాం. అద్దాల మేడపై రాయి వేస్తే తిరిగి నిర్మించుకోవడం కష్టం. డ్రగ్స్‌ వ్యవహారంలో నిజమైన దోషులను శిక్షించండి. విచారణ పేరుతో అందరినీ వేధించడం సరికాదు.’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement