తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వపరంగా చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
'ఆర్టీసీ మనుగడ, కార్మికుల భద్రతే ధ్యేయం’
Published Mon, Jan 11 2016 2:18 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
గుంతకల్లు: తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వపరంగా చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ మనుగడ, కార్మికుల భద్రతే తమ ధ్యేయమని ఆయన అన్నారు. సోమవారం ఆయన గుంతకల్లు ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా డిపో సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డికి పార్టీ మజ్దూర్ విభాగం నాయకులను పరిచయం చేశారు. ఆయన వెంట నియోజకవర్గ సమన్వయ కర్త వై.వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement