బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు.. | ysrcp mla kodali nani takes on tdp mlas | Sakshi
Sakshi News home page

బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు..

Dec 23 2014 1:35 PM | Updated on Aug 18 2018 5:15 PM

బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు.. - Sakshi

బాబు తవ్విస్తే...వైఎస్ఆర్ పూడ్చేసినట్లు..

కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

హైదరాబాద్ : కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్విస్తే...వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కొల్లేరు కాంటూరుపై మంగళవారం సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువులు తొలగించటం జరిగిందన్నారు.

అనంతరం ఆయన అసెంబ్లీలో కొల్లేరు కాంటూరుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అనంతరం ఆరు నెలలకే దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవటంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement