‘ఆ ఘనత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌దే’ 

YSRCP MLA Karanam Dharmasri Praises CM YS Jagan Over Funds To Sugar Factories - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఉన్న నాలుగు చెక్కర ఫ్యాక్టరీల అభివృద్ధికి రూ. 100 కోట్ల గ్రాంటు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొనియాడారు. సీఎం జగన్‌ మరో ఎన్నికల హామిని నెరవేర్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  సహకార చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు రూ. 200 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో గోవాడ చెక్కెర ఫ్యాక్టరీ రూ.150 కోట్ల నష్టాల ఊబిలో ఉందని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 40.25కోట్లు మంజూరైందని, రెండు రోజుల్లో గోవాడ చెక్కర కర్మాగారం రైతులు, కార్మికులకు రూ. 18.28 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రూ. 22 కోట్లతో డిస్టలరీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 47 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వడం వల్ల రైతులకు, కార్మికులకు ఏంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

సీఎం జగన్‌ రైతు పక్షపాతి : బీశెట్టి సత్యవతి 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీలు మూలన పడ్డాయని ఆరోపించారు. సీఎం జగన్‌ రైతు బాంధవుడని కొనియాడారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top