'టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి చందబాబుదే' | YSRCP MLA Gurunath reddy furious over JC diwakar Reddy | Sakshi
Sakshi News home page

'టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి చందబాబుదే'

Mar 2 2014 1:42 PM | Updated on May 29 2018 4:09 PM

'టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి చందబాబుదే' - Sakshi

'టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి చందబాబుదే'

మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డిపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం: మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డిపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు. టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుదేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో జేసీ పనిచేస్తున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. జేసీ 35 కోట్ల రూపాయలు ఇచ్చి టీడీపీలో చేరుతున్నారని ఆరోపించారు. 
 
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని గుర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిని  రాజకీయంగా ఎదుర్కోలేకనే బాబు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారన్నారు.  చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగానే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. జగన్‌ ఓదార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆయన తెలియచేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement