వైఎస్సార్ సీపీ నేత, చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి భర్త కేజే కుమార్ సహా అనుచరులు రామ్మూర్తి, దండపాణి, వేలాయుగాలకు ఈనెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
చిత్తూరు: వైఎస్సార్ సీపీ నేత, చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి భర్త కేజే కుమార్ సహా అనుచరులు రామ్మూర్తి, దండపాణి, వేలాయుగాలకు ఈనెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు వీరిని చిత్తూరు జైలుకు తరలించారు.
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కేజే కుమార్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేశారు. శాంతకుమారి నివాసంలోని గేట్లు పగులగొట్టి కేజే కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రోత్సాహంతోనే పోలీసులు తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని శాంతకుమారి ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని వాపోయారు.