కృష్ణానదిలో విషాదం.. స్పీడ్‌ బోటు ఉండి ఉంటే..!

ysrcp leaders fire on babu govt over krishna river tragedy - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోటు మునిగిపోయి.. ప్రయాణికులు చనిపోయిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అన్నారు. ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించడంపై వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, జోగి రమేశ్‌, ఉదయభాను తదితరులు మండిపడ్డారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ముమ్ముటికీ ప్రభుత్వ వైఫల్యమే..!
కృష్ణానదిలో జరిగిన ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్సీపీ నేత పార్థసారథి అన్నారు. 'స్పీడ్‌ బోటు ఉండి ఉంటే ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ చనిపోయేవారు కాదని స్మిమ్మర్‌ స్వయంగా చెప్పారు. సిమ్మరే వెళ్లి గొడ్డలి, సుత్తి తెప్పించుకొని బోటుకు రంధ్రం చేయడంతో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు' అని ఆయన తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కన్నా ముందే తాము ప్రమాద స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ప్రారంభించామని చెప్పారు. 'ప్రైవేటు వాళ్లకు బోట్లు ఇచ్చారు. ముందస్తు భద్రతా చర్యలను ఏమాత్రం తీసుకోలేదు. ఒక్కరికి కూడా లైవ్‌ జాకెట్‌ ఇవ్వలేదు. బోటులో సిమ్మర్లు లేరు. డ్రైవర్‌ కొత్తవాడు. అంబులెన్స్‌ కూడా అందుబాటులో లేదు' అని ఆయన అన్నారు.

సాయంత్రం 5.20 గంటలకు ప్రమాదం గురించి 108కు సమాచారం ఇచ్చారని. అయినా వెంటనే ఎవరూ స్పందించలేదని అన్నారు. సహాయక చర్యలు చేపడుతూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తమపై  మాపైనే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులు, ప్రభుత్వం తమ వైఫల్యం కవర్‌ చేసుకోవడానికే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్‌, ఉదయభాను అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top