ఉండి : ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలు, అన్యాయాలు ఎంతోకాలం సాగవని వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. మంగళవారం చెరుకువాడలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పెదపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న నిరుపేదలకు కూడా సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. దివ్యాంగులకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అ«ధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్‌వర్మ (బాబు), మండలాధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, గ్రామ పార్టీ అ«ధ్యక్షుడు కొండవీటి సత్యనారాయణ, జిల్లా నాయకులు అల్లూరి వెంకట్రాజు, కొరపాటి అనిత, బందెల ప్రమీల, కరిమెరక చంద్రరావు, అంగర రాంబాబు, ఎంపీటీసీలు అందుకూరి రాజు, వర్రే పైడియ్య, మేకా పార్వతి, పుప్పాల సత్యనారాయణ, అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బాబు మోసాలు ఎంతోకాలం సాగవు
Nov 15 2017 11:00 AM | Updated on May 29 2018 4:37 PM
Advertisement
Advertisement