ఎమ్మెల్యే రోజాపై టీడీపీ తీరును నిరసిస్తూ ధర్నా | ysrcp leaders dharna in yeleswaram | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రోజాపై టీడీపీ తీరును నిరసిస్తూ ధర్నా

Dec 24 2014 12:23 AM | Updated on Aug 10 2018 8:13 PM

శాసనసభలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేత

ఏలేశ్వరం : శాసనసభలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేత అలమండ చలమయ్య ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద సుమారు గంటపాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చలమయ్య మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ప్రవర్తించిన తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు.

గోరంట్ల తమ వైఖరి మార్చుకోకపోతే మహిళలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కళాకారుడైన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉంటూ కళాకారులను విమర్శించడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. ఎన్టీఆర్ పెట్టిన బిక్షతో పాలన సాగిస్తున్న ఆపార్టీ నాయకులు ఇకనైనా గతం మరిచిపోకూడద ని గుర్తుచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సామంతుల సూర్యకుమార్, గొడత చంద్ర, భజంతుల మణి, వాడపల్లి శ్రీను, పేకలజాన్, ఉమ్మడిసింగు సత్యనారాయణ, గూనాపు అప్పలరాజు, తూరోతు దొరయ్య, కూనపురెడ్డి సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement