'పవన్ కొత్తదారి కనిపెట్టారు' | YSRCP Leaders Criticise Pawan Kalyan Tweets | Sakshi
Sakshi News home page

'పవన్ కొత్తదారి కనిపెట్టారు'

Jun 29 2015 12:58 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్ కొత్తదారి కనిపెట్టారు' - Sakshi

'పవన్ కొత్తదారి కనిపెట్టారు'

పవన్ కల్యాణ్ దేనిమీద ప్రశ్నిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వైఎస్సార్ సీపీ నాయకులు గుడివాడ అమర్, ప్రసాద్ రెడ్డి విమర్శించారు.

విశాఖపట్నం: పవన్ కల్యాణ్ దేనిమీద ప్రశ్నిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వైఎస్సార్ సీపీ నాయకులు గుడివాడ అమర్, ప్రసాద్ రెడ్డి విమర్శించారు. పశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నిసార్లు ప్రశ్నించారో అందరికి తెలుసునన్నారు. పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ట్విటర్ వ్యాఖ్యల్లో సమాజం కోసం తాపత్రయం కనిపించలేదని ధ్వజమెత్తారు. పవన్ వ్యాఖ్యలు ఆయన మేధావితనానికి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు.

అభిమానులను అడ్డం పెట్టుకుని ప్రపంచంలో ఏ నటుడు చేయనంత అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. అభిమానులను ఎర చూపి టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లు వేయించి డబ్బు సంపాదించారని అన్నారు. ట్విటర్ పోస్ట్ లో చేస్తే డబ్బులు వస్తాయని పవన్ కొత్తదారి కనిపెట్టారని వ్యంగ్యంగా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement