అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది  | Sreeleela Talks About Ustad Bhagat Singh Pre release press meet | Sakshi
Sakshi News home page

అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది 

Mar 19 2026 1:32 AM | Updated on Mar 19 2026 1:32 AM

Sreeleela Talks About Ustad Bhagat Singh Pre release press meet

– శ్రీలీల

‘‘తెలుగు నూతన సంవత్సరాది కానుకగా మా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా నేడు విడుదలవుతుండటం మాకు చాలా ప్రత్యేకం. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. ఒక మంచి తెలుగు సినిమా అయిన మా మూవీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అని శ్రీలీల తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్‌ అవుతోంది. 

బుధవారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘పాటలు, డ్యాన్స్, డైలాగ్స్, ప్రేమ, హాస్యం, విలన్‌తో పవర్‌ఫుల్‌ సీన్స్‌... ఇలా అన్ని అంశాలు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్లు మరిన్ని సినిమాలు తీస్తూ పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని చె΄్పారు. నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ– ‘‘వినోదం, భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు నిండి... ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు రాశీ ఖన్నా.  

Advertisement
 
Advertisement
Advertisement