
వెల్దుర్తి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నాయకులు మంగళవారం వెల్దుర్తిలో బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వెల్దుర్తి నుంచి రామళ్లకోట మీదుగా గురువారం పాదయాత్ర సాగే సర్పరాజాపురం వరకు, అక్కడి నుంచి నర్సాపురం, బోయనపల్లె మీదుగా వెల్దుర్తి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ జగనన్న పాదయాత్ర ప్రజా సంకల్పమేనని, ఈ యాత్ర సందర్భంగా ప్రజలు ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు. ర్యాలీలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, నాయకులు చెరుకులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి, శ్రీరాంరెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, గోవర్ధనగిరి ఎంపీటీసీ సభ్యులు గోపాల్, ఆరిఫ్, నాగిరెడ్డి, సుమన్, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.