‘నరకాసురవధ’కు కదలివచ్చిన రైతన్న | Sakshi
Sakshi News home page

‘నరకాసురవధ’కు కదలివచ్చిన రైతన్న

Published Fri, Jul 25 2014 2:35 AM

‘నరకాసురవధ’కు కదలివచ్చిన రైతన్న - Sakshi

 శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై నమ్మించి మోసం చేసిందంటూ రైతులు రోడ్డె క్కారు. వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు నర కాసుర వధ పేరిట గురువారం జరిగిన ఆం దోళన కార్యక్రమాల్లో రైతులు భాగస్వామ్యు లయ్యారు. ఎన్నికల ముందు రుణ మాఫీ చేస్తామని హామీనివ్వడంతో చంద్రబాబును నమ్మలేక నమ్మి ఓట్లు వేశామని అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీపై రోజుకో రకమైన ప్రకటనతో కాలక్షేపం చేస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు నియో జకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. శ్రీకాకుళంలో వైఎస్ ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఇచ్ఛాపురంలో నియోజకవర్గ సమన్వయకర్త  నర్తు రామారావు, పలాసలో నియోజకవర్గ సమన్వయ కర్త వజ్జ బాబూరావు, నరసన్నపే టలో సారవకోట జెడ్పీటీసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, ఎచ్చెర్లలో నియోజకవర్గ సమన్వ యకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ల నేతృత్వం లో ఆం దోళనలు జరిగాయి.
 
  పాలకొండలో శాసన సభ్యురాలు విశ్వసరాయ కళావతి, పాతపట్నం లో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ,              రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వ ర్యంలో ఆందోళనలు చేపట్టారు.చంద్రబాబు వల్ల మోసపోయామని ఖరీఫ్ సీజన్‌లో రుణా లు అందక అవస్థలు పడుతున్నామని రైతులు వాపోయారు. శుక్ర, శనివారాల్లో వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టనున్న ఆందోళనలో భాగస్వాములు కావాలని కూడా వారు నిర్ణయిం చుకున్నారు.  ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రణస్థలం మండలం పైడిభీమవరంలో నరకా సుర వధ కార్యఖ్రమంలో భాగంగా రైతులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. తక్షణం రుణాలు రైతు, డ్వాక్రా రుణాల రుణా లు మాఫీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ  చంద్రబాబు దిష్టబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నియోజక వర్గ సమ న్వయకర్త, గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాలనాయుడు పాల్గొన్నారు.
 
   ఇచ్ఛాపురం నియోజవర్గంలోని ఇచ్ఛా పురం, సోంపేట, కవిటిలో నిరసన కార్య క్రమాలు జరిగాయి. కవిటిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నర్తు రామారావు, పిఎం.తిలక్, శ్యాంపురి యా, ఇచ్ఛాపురం లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, మునిసిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, సోంపేటలో పిరియా విజయ పాల్గొన్నారు.  నరసన్నపేట  వైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను పార్టీ శ్రేణులు, రైతులు దహనం చేసి నిరసన తెలిపారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంత రాయం కలిగింది. కార్యక్రమంలో పార్టీ కేం ద్ర పాలక మండలి సభ్యురాలు ధర్మాన పద్మ ప్రియ, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు ధర్మాన రామ లింగన్నాయుడు పాల్గొన్నారు.
 
  పలాసలో కూడా నరకాసురవధ కార్య క్రమంలో భాగంగా సీఎం బాబు దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయ కుడు వజ్జ బాబూరావు మాట్లాడుతూ రుణ మాఫీ విషయంలో సీఎం మాటతప్ప డంపై మండిపడ్డారు. కార్యక్రమంలో పలాస ఎంపీపీ కొయ్య శ్రీనివాసరెడ్డి, పట్టణ కన్వీనర్ బళ్ల గిరిబాబు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పేరాడ తిలక్, నందిగాం ఎంపీపీ ఎర్ర విశ్వ శాంతి చక్రవర్తి, నందిగాం జడ్‌పీటీసీ సభ్యుడు కురమాన బాల కృష్ణారావు, పీఏసీఎస్ అధ్యక్షు డు దువ్వాడ మధుకేశ్వ రరావు పాల్గొన్నారు.
 
   పాలకొండలో నరకాసురవధ పేరిట సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో పాటు ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి దహనం చేశారు. అంతకు ముందు ధర్నా చేపట్టి ట్రాఫిక్ స్తంభింప జేసి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త పాలవ లస విక్రాంత్ పాల్గొన్నారు.   పాతపట్నం నియోజకవర్గంలోని ఆంధ్ర- ఒడిస్సా రాష్ట్రాలను కలిపే వంశధార నది పైన నిర్మించిన అంతర్ రాష్ట్ర వంతెనగా పిలిచే మాతల-నివగాం వంతెనపైన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో కొత్తూ రులో ధర్నా నిర్వహించి సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. నాయకులు పి.మోహనరావు, ఎన్.వీరభద్రరావు, ఎ. అరుణకుమార్, మూర్తి, నెల్లి అచ్చుతరావు, రేగేటి మోహనరావు, ఉర్లపు వెంకటరావు పాల్గొన్నారు.   
 

Advertisement
Advertisement