వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశం | ysrcp chief ys jagan mohan reddy conduct review meeting | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశం

Sep 9 2014 12:19 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల పునర్‌వ్యస్థీకరించిన ఆ పార్టీ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభమైంది.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల పునర్‌వ్యస్థీకరించిన ఆ పార్టీ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. 2014 ఎన్నికల తరువాత జరుగనున్న తొలి విస్తృత స్థాయి సమావేశం అయినందున దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీల్లో చాలా మందికి అవకాశం కల్పించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం, మండలాలు, జిల్లాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అదే విధంగా సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికపుడు స్పందించేందుకు వీలుగా పార్టీ అధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement