
సింహాద్రిపురం : ప్రకృతి ప్రేమికుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ప్రకృతి విధ్వంసకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ రైతు విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సింహాద్రిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల పాలిట ప్రకృతి జగనన్న అని, సకాలంలో సరిపడా వానలు కరుణిస్తేనే రైతాంగం సులువుగా బయటపడుతారన్నారు. ఇంతకమునుపు చంద్రబాబు పాలనలో ప్రకృ తి వైఫరీత్యాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాయని, లాభసాటి ధరలతో రైతాంగం సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
చంద్రబాబు హయాంలో గత మూడేళ్లు వర్షాలు లేక కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ఖరీఫ్‌లో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రకృతి ప్రేమికులైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర మొదలయ్యే తెల్లవారుజామున భారీ వర్షం కురవడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకృతి దేవత స్వాగతం పలికందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి వర్షం ద్వారా స్వాగతిస్తూనే ఉందన్నారు. ప్రకృతి కరుణవల్ల వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాబోవు రోజుల్లో తిరిగి వైఎస్సార్ పాలన చూస్తారన్నా రు.
అంతకముందు వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరవిందనాథరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు అధ్యక్షుడు శివరామిరెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు జనరల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.