పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట: విజయసాయి | ysr congress priority to active workers, says vijaysai reddy | Sakshi
Sakshi News home page

పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట: విజయసాయి

Oct 26 2014 7:56 PM | Updated on Aug 9 2018 2:49 PM

పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట: విజయసాయి - Sakshi

పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట: విజయసాయి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలను కార్యకర్తలకు మరింత చేరువ చేసేందుకు త్వరలోనే ప్రజాప్రస్థానం పేరుతో ఓ మాస పత్రికను తీసుకురాబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలను కార్యకర్తలకు మరింత చేరువ చేసేందుకు త్వరలోనే ప్రజాప్రస్థానం పేరుతో ఓ మాస పత్రికను తీసుకురాబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండే కార్యకర్తలు, అభిమానుల కోసం నెట్ టీవీని కూడా ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.

పార్టీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు మార్చబోతున్నామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వచ్చే నెల 5న మండల కేంద్రాల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజుతో కలిసి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement