అనుమానాస్పద ఓట్ల సర్వేపై ఫిర్యాదు | YSR Congress party leaders Complaint on TDP Voters Survey | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద ఓట్ల సర్వేపై ఫిర్యాదు

Jan 14 2019 12:35 PM | Updated on Jan 14 2019 12:35 PM

YSR Congress party leaders Complaint on TDP Voters Survey - Sakshi

పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో సీఐతో మాట్లాడి వస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు

గుంటూరు(లక్ష్మీపురం): స్థానిక గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, కళ్యాణి నగర్‌ ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఓటరు సర్వే చేస్తున్న ఆరుగురు విద్యార్థులను స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విద్యార్థులు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తున్నారా. లేదా ప్రశ్నిస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ నేతలు వీరిని నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు లేళ్ళఅప్పిరెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పట్టాభిపురం సీఐ వెంకటేశ్వరరావును కలిశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు వైఎస్సార్‌ సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, విచారణ చేయాలని కోరారు. ప్రజలు కూడా సర్వేలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్వేలకు వచ్చే సంస్థల గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యార్థులు డిగ్రీ చదువుతున్నట్లు తెలిపారు. రోజుకు రూ.600 ప్రాతిపదికన స్మార్ట్‌ సిస్టమ్యాటిక్‌ మార్కెటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ట్రూత్‌ సంస్థ ద్వారా సర్వే చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement