ప్రధానిని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు | YSR congress party delegation meets PM Manmohan singh in Delhi | Sakshi
Sakshi News home page

ప్రధానిని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు

Aug 27 2013 12:06 PM | Updated on May 25 2018 9:10 PM

పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బృందం మంగళవార ఉందయం ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలిసింది.

న్యూఢిల్లీ : పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బృందం మంగళవార ఉందయం ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలిసింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై వారు ఈ సందర్భంగా ప్రధానికి  మెమొరాండం సమర్పించారు. 57ఏళ్లుగా కలిసున్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి ఇచ్చిన మూడు పేజీల లేఖలో పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం 11గంటల సమయంలో ప్రధాని నివాసానికి వెళ్లిన ఈ బృందంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మైసూరారెడ్డి, బాలినేని, కొడాలి నాని, బాబూరావు తదితరులు ఉన్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement