వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 29న తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి తెలిపారు.
తిరుపతి రూరల్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 29న తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆదివారం కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ 29వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాద్‌రాజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. వీరితో పాటు పార్టీ జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి అతిథులుగా హాజరౌతారన్నారు.
జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్ విండో అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ ప్రతిష్టకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవరావు, తిరుపతి రూరల్ ఎంపీపీ అనురాధామునస్వామి, లోకనాథరెడ్డి, మాధవరెడ్డి, మునీశ్వరరెడ్డి, హేమశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.