నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం | YSR Congress Committee meeting today trisabhya | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం

Jan 17 2015 6:14 AM | Updated on Aug 9 2018 2:44 PM

నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం - Sakshi

నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది.

  • కృష్ణా,గుంటూరు జిల్లాల నేతలు హాజరు
  •  వేదిక విజయవాడలోని నాడార్‌‌స కల్యాణ మండపం
  •  విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, ప్రసాదరాజు రాక
  •  జగన్ దీక్ష నేపథ్యంలో...
  • సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంట్ నియోజక    వర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు హజరుకానున్నారు.   31వ తేదీ , ఫిబ్రవరి 1వ తేదీల్లో పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తలపెట్టిన దీక్షను విజయవంతం చేయడానికి త్రిసభ్య కమిటీ వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.  

    శనివారం ఉదయం 11 గంటలకు సత్యనారాయణపురంలోని నాడర్ కళ్యాణ మండపంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు  హజరు కానున్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరు సాగించడానికి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి ముందస్తుగా సమావేశం నిర్వహిస్తున్నారు.   ప్రభుత్వం రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హమీల తీరుపై ప్రసంగించనున్నారు.
     
    విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం

    సమావేశానికి  ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరుగనుంది. సమావేశంలో పార్టీ త్రిసభ్య కమిటీ నేతలు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొంటారు. సమావేశంలో యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement