నేడు శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ పర్యటన | Ys vijayamma tour in Srikakulam district today | Sakshi
Sakshi News home page

నేడు శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ పర్యటన

Oct 16 2013 2:52 AM | Updated on Oct 1 2018 2:00 PM

నేడు శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ పర్యటన - Sakshi

నేడు శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ పర్యటన

పై-లీన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బుధవారం ఉదయం పర్యటిస్తారు.

సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బుధవారం ఉదయం పర్యటిస్తారు. తుపాను గండం గడిచినప్పటికీ దాని ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో జీడి, కొబ్బరి, అరటి, వరి, కూరగాయలు, ఉద్యాన పంటల సాగు చేస్తున్న రైతులు పై-లీన్ విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాధిత రైతులను పరామర్శిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement