హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ | YS vijayamma returns to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ

Oct 17 2013 9:30 AM | Updated on May 25 2018 9:10 PM

హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ - Sakshi

హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం ఉదయం హైదరాబాద్ బయల్దేరారు.

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ బయల్దేరారు.శ్రీకాకుళం జిల్లాలో నిన్న తుపాను బాధితుల్ని పరామర్శించిన  ఆమె గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. పై-లీన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో విజయమ్మ నిన్న విస్తృతంగా పర్యటించారు.

ఆమె అడుగిడిన ప్రతిచోటా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ కష్టాలు చెప్పుకొన్నారు. రైతుల కష్ట నష్టాలు తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ... వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ...  రైతులకు అండగా ఉంటామని విజయమ్మ హామీ ఇచ్చారు.నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు.

Advertisement
 
Advertisement
Advertisement