
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురం ఆ తరువాత నరసన్నపేట, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ పాల్గొంటారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో షర్మిల ప్రచారం..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆదివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.