అభివృద్ధికి చిరునామా వైఎస్సార్‌

YS Rajasekhara Reddy Jayanti Celebration In YSR Kadapa - Sakshi

రైల్వేకోడూరు : ప్రతి ఇంటికి తమ పథకాలతో చేరువై.. రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామాగా నిలిచిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే అని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జయంతి సందర్భంగా ఆదివారం  పట్టణంలోని టోల్‌గేట్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ వైఎస్సార్‌ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని, అందుకే ఆయన వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ ప్రజల కోసమే తపించారని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా ఖరీదైన వైద్యం అం దాలనే లక్ష్యంతో రాజీవ్‌ఆరోగ్యశ్రీ,, 108 వంటి సౌకర్యాలను కల్పించారని తెలిపారు. దీంతో వైఎస్‌ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర ఏర్పరుచుకున్నారని వివరించారు.

రైతులకు ఉచిత విద్యుత్‌పై ఆయన ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేశారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బండారు సుబద్రమ్మ, జెడ్సీటీసీ మారెళ్ల రాజేశ్వరి,  పార్టీ వివిధ విభాగాల కన్వీనర్లు, నాయకులు సీహెచ్‌ రమేష్, కౌరెడ్డి సిద్దయ్య, మందల నాగేంద్ర, ముజీబ్, ఇనమాల మహేష్, అబ్దుల్‌ రౌఫ్, నారాయణరెడ్డి, సుబ్బరామిరెడ్డి, సీసీ చలపతి, తిరుపతి శేఖర్, రామచంద్రారెడ్డి, దొంతిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సుదర్శన్‌రాజు, రత్తయ్య, ఎంపీటీసీలు మందల శివయ్య, సుబ్రమణ్యం, రవిశంకర్, రమణారెడ్డి, ఏ సులోచన తదితరులు పాల్గొన్నారు.
 
వాడవాడలా వైఎస్సార్‌ జయంతి 
మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో  వైఎస్‌ జయంతి వేడుకలను ప్రజలు, వైఎస్సార్‌ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తంబిళ్లవారిపల్లెలో పంజం విజయ రంగారెడ్డి, రక్కాసి సుబ్రమణ్యంరెడ్డి, మందపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే తూర్పుపల్లెలో నీటి సంఘం అధ్యక్షుడు పంజం వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.  వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆకేపాటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top