‘విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు’ | ys jaganmohan reddy visits at krishna district over farmers problems | Sakshi
Sakshi News home page

‘విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు’

Jan 30 2017 10:56 AM | Updated on Jun 4 2019 5:16 PM

‘విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు’ - Sakshi

‘విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు’

చంద్రబాబు హాయంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు హాయంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఉదయం ఆయన పర్యటన ప్రారంభమైంది. బొమ్ములూరులో నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పంటల పరిస్థితి ఈ విధంగా ఉండడం దారుణమన్నారు. ‘ప్రతి రోజు చంద్రబాబు ఇక్కడ నుంచే ఫ్లైట్‌ ఎక్కుతారు. విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు కానీ, రైతుల కష్టాలను పట్టించుకోర’ని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోగా, బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో 18 వేల ఎకరాలకు గాను.. వెయ్యి ఎకరాలే సాగు అవుతున్నాయన్నారు. రైతుల పరిస్థితిపై సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాజధాని ప్రాంతంలో మూడు, నాలుగు పంటలు పండే భూములు నీరు లేక ఎండిపోతున్నాయని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మెట్టప్రాంతాల్లో పంటలు ఎండిపోతాయని.. కానీ డెల్టా ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోవడం బాధకరమన్నారు. మినుము ధర క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయిందని రైతులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. కనీసం పంటను కూడా కాపాడుకోలేక పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. పంట నష్టంపై ఎలాంటి సర్వే చేయరు. ఏ అధికారి పర్యవేక్షణకు రారని జగన్‌ ధ‍్వజమెత్తారు. నష్టపోయిన పంటలకు పైసా నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ పర్యటనలో జగన్‌ వెంట ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, మేకా ప్రతాప్‌ అప్పారావు, పార్టీ నేతలు రామచంద్రరావు, జోగి రమేష్‌, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement