
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.
బుధవారం ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి 100వ రోజు వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్లురు క్రాస్ మీదుగా మర్రిచెట్టపాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. ఆయన అక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బుదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. ఆయన రాత్రి ఇక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1340 కిలోమీటర్లు నడిచారు.