నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన | Ys jagan mohan reddy to tour from West godavari district today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన

Mar 14 2014 12:46 AM | Updated on Jul 25 2018 4:09 PM

నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన - Sakshi

నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

ఏలూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం నరసాపురంలో జనభేరి నిర్వహిస్తారని పేర్కొన్నారు. 15న పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోను, 16న కొవ్వూరులో రోడ్‌షో నిర్వహిస్తారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement