జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy hoists national flag in nandyal | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

Aug 16 2017 3:55 AM | Updated on Jul 25 2018 4:09 PM

71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని బొమ్మలసత్రం సెంటర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు.




నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నంద్యాలలో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నంద్యాలలోని బొమ్మల సత్రంలో తాను విడిది చేసిన గృహానికి ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్‌ ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరడానికి ముందుగా జాతీయ జెండాను ఎగుర వేశారు.

ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ప్రచారానికి బయల్దేరి వెళ్లారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో పార్టీ ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.పి.సారథి, నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement