
పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
వైఎస్సార్ జిల్లా: ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ జగన్ కుటంబసమేతంగా పాల్గొని ప్రార్థనలు చేశారు.
క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అందరికీ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మీయంగా పలకరించారు. అంతేకాకుండా ప్రార్థనలలో పాల్గొన్న వారి యోగక్షేమాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు.