
జానమద్ది కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి పట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి పట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జానమద్ది కుటుంబ సభ్యులను ఆయన శుక్రవారం ఫోన్లో పరామర్శించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సి.పి. బ్రౌన్ గ్రంథాలయానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది అంత్యక్రియలు జరుగుతాయి. శుక్రవారం ఉదయం జానమద్ది తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.