breaking news
Janamaddi Hanumath Sastry
-
‘బ్రౌన్ శాస్త్రి’ జానమద్ది
రాయదుర్గంలో మొలిచిన జానెడు మొలక కడపలో పెరిగిన మహా మద్ది చెట్టు ఇంగ్లిష్ బ్రౌనుకు తెలుగు ఆత్మ మొండిగోడల ఇసుక నుంచి మహాసౌధ తైలం పిండిన బలశాలి అంటుసొంటుల సమాజంలో పుట్టి మడులు దడులు పొడగిట్టని మనస్వి మనిషే కాదు మనసూ తెలుపే మనిషి కనిపిస్తే చాలు మల్లెపువ్వై వికసిస్తాడు వారసులు లేని పుస్తకాలకు అనాథాశ్రమ నిర్మాత కొత్తపాతల మేలుకలయిక రోజుకొక పుటైనా రాయందే నిద్రపట్టని అక్షర మాంత్రికుడు జ్ఞాపకాల పుట్ట చారిత్రక కవిలెకట్ట (నేడు కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు హనుమచ్చాస్త్రి తొలి వర్ధంతి) రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత) -
‘బ్రౌన్ శాస్త్రి’ జానమద్ది కన్నుమూత
సాక్షి, కడప: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం ఉదయం కడప రిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. డిసెంబర్ చివరివారంలో అస్వస్థతకు గురైన ఆయన మొదట హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన్ను కడప రిమ్స్‌లో చేర్చారు. దాదాపు రెండు నెలలు కోమాలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం 6.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని పలు ముఖ్య కూడళ్ల ద్వారా ఊరేగింపుగా రామకృష్ణ జూనియర్ కళాశాల వద్దగల స్మశాన వాటికకు చేర్చారు. బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1925 అక్టోబర్ 10న హనుమచ్ఛాస్త్రి జన్మించారు. తండ్రి సుబ్బన్న, తల్లి జానకమ్మ. కడపజిల్లా రచయితల సంఘం వ్యవస్థాపనలో, బ్రౌన్ గ్రంథాలయ రూపకల్పనలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన కృషికి మెచ్చిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి ‘బ్రౌన్ శాస్త్రి’ అని పిలిచేవారు. ఆయన ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ‘ఎందరో మహానుభావులు’ పేరిట వ్యాసాలు రాశారు. కన్నడం, ఆంగ్లం, అనువాదాలతో కలిపి ఆయన మొత్తం రెండున్నర వేల వ్యాసాలు రాశారు. సాహిత్య అకాడమీ సభ్యుడిగా వ్యవహరించారు. మొత్తం 22 పుస్తకాలు వెలువరించారు. 8వ తరగతి తెలుగు వాచకంలో బళ్ళారి రాఘవపై ఆయన రచనను పాఠంగా ఉంచారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లోనూ ఆయన రచనలు పాఠాలుగా ఉండటం విశేషం. బ్రౌన్ గ్రంథాలయ ప్రారంభోత్సవ సందర్భంగా 1995 నవంబర్ 29న నాటి సీఎంచే సత్కారం, 1996 జనవరి 25న నాటి భారత ప్రధాని పీవీ నరసింహారావుచే సత్కారం పొందారు. 1999లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినారె, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర నేతలు తెలకపల్లి రవి, వరప్రసాద్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాజీ సలహాదారు కేవీ రమణాచారి తమ సంతాపాన్ని తెలిపారు. కోర్ కమిటీ భేటీలో ‘ఆర్డినెన్స్’లపై చర్చ... సాక్షి, న్యూఢిల్లీ: శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు ప్రధాని మన్మోహన్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యులతో కూడిన కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ప్రధానితో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, రక్షణమంత్రి ఆంటోని, ఆర్థికమంత్రి చిదంబరం, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ అంశాలు చర్చించేందుకు మంత్రులు కపిల్‌సిబల్, జైరాంరమేశ్, మల్లికార్జునఖర్గే, నారాయణసామి కూడా హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు మరోసారి కేబినెట్ భేటీ అయ్యి ఆమోదించాల్సిన అంశాలపై చర్చించారు. అవినీతి వ్యతిరేక బిల్లులకు సంబంధించిన కొన్ని ఆర్డినెన్స్‌లు తేవాలా వద్దా అన్న అంశంపై లోతుగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు మరొక ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న తెలంగాణ బిల్లుకు నేడో రేపో ఆమోదముద్ర పడే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
జానమద్ది కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి పట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జానమద్ది కుటుంబ సభ్యులను ఆయన శుక్రవారం ఫోన్లో పరామర్శించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సి.పి. బ్రౌన్ గ్రంథాలయానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది అంత్యక్రియలు జరుగుతాయి. శుక్రవారం ఉదయం జానమద్ది తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత
-
జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత
కడప: ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణించారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయం బ్రౌన్ గ్రంథాలయంలో ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానమద్ది హనుమచ్ఛాస్త్రి సెప్టెంబరు 5, 1926 సంవత్సరంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించాడు. 1946లో బళ్ళారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడ్డారు. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించారు.