పరీకర్‌ మృతి పట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Condolence On Manohar Parrikar Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌ మృతిపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక నిజాయితీ గల నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన తన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. కాగా, గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్‌ ఆదివారం పణజిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావిగా పేరున్న పరీకర్‌ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస​ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు పరీకర్‌ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు(సోమవారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top