
వైఎస్ జగన్ పాదయాత్ర 284వ రోజు శనివారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం శివారు నుంచి ప్రారంభమైంది.
సాక్షి, గజపతినగరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 284వ రోజు శనివారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం శివారు నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు.
అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు కదులుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గజపతినగరం నియోజకవర్గంలోని మధుపాడు, భూదేవీపేట క్రాస్, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్, గుడివాడ క్రాస్, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు ఈ రోజు పాదయాత్ర సాగనుంది.