
అక్కడి నుంచి జిడ్డేటి వలస క్రాస్ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
సాక్షి, ఎస్.కోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 273వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ ఎస్. కోట నియోజకవర్గంలోని జామి మండలంలో నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జిడ్డేటి వలస క్రాస్ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ మధ్యాహ్నా భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ప్రకటనలో తెలిపారు.