జగన్ సీఎం కావాలని తిరుమలకు ఎమ్మెల్యే పాదయాత్ర

YRCP MLA Gopireddy Srinivas Reddy  begins padayatra for ys jagan - Sakshi

సాక్షి, గుంటూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ‍్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శనివారం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ... 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అలాగే మా నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం తధ్యమన్నారు.

ఈ యాత్రలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు 150 మంది పాల్గొంటారు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల్లో తిరుమలకు చేరుకుంటారు. పాదయాత్రలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, మహ్మద్‌ ముస్తాఫా, పార్టీ నేతలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబుతో పాటు ఇతర జిల్లా నాయకులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top