పాతాళగంగలో యువకుడి మృత్యువాత | Youth dies in Patalaganga in Srisailam | Sakshi
Sakshi News home page

పాతాళగంగలో యువకుడి మృత్యువాత

Sep 1 2015 7:06 PM | Updated on Sep 18 2019 3:24 PM

శ్రీశైల దేవస్థానం పరిధిలోని పాతాళగంగలో మంగళవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి(23) మృతదేహాన్ని కనుగొన్నారు.

శ్రీశైలం (కర్నూలు) : శ్రీశైల దేవస్థానం పరిధిలోని పాతాళగంగలో మంగళవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి(23) మృతదేహాన్ని కనుగొన్నారు. స్థానిక జాలర్లు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ప్రదీప్‌గా గుర్తించారు.

అతని సెల్ ఫోన్ నంబర్ 9133818891 కాగా, ఆ సెల్‌కు వచ్చిన చివరి కాల్ గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వీరాంజనేయులు ఫోన్ 9642351322గా నమోదైందని ఏఎస్సై రామచంద్రగౌడ్ తెలిపారు. అయితే ఆ నెంబరుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. సీఐ చక్రవర్తి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శ్రీశైలం ప్రాజెక్టు వైద్యశాలకు తరలించారు. కాగా ఇది ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement