ఫేస్బుక్లో ఫోటోలు పెడతా.. జాగ్రత్త! | Youth blackmails lady in the name of love | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో ఫోటోలు పెడతా.. జాగ్రత్త!

Dec 13 2013 10:26 AM | Updated on Jul 26 2018 5:21 PM

ఫేస్బుక్లో ఫోటోలు పెడతా.. జాగ్రత్త! - Sakshi

ఫేస్బుక్లో ఫోటోలు పెడతా.. జాగ్రత్త!

ప్రేమ పేరుతో వేధించటమే కాకుండా వేరొకరితో తనకు కుదిరిన సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్రిస్తున్నాడని ఓ యువకుడిపై బాధితురాలు గురువారం పోలీసుల్ని ఆశ్రయించింది.

హైదరాబాద్ : ప్రేమ పేరుతో వేధించటమే కాకుండా వేరొకరితో తనకు కుదిరిన సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్రిస్తున్నాడని ఓ యువకుడిపై బాధితురాలు గురువారం పోలీసుల్ని ఆశ్రయించింది.  పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన ఉదయ్ (25) ఓ ప్రయివేట్ ఛానల్లో టెక్నీషియస్. బంజారాహిల్స్ పరిధిలోని దేవరకొండ బస్తీలో ఉంటున్న అతనికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఫోన్లో పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకున్న ఉదయ్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవలి ఆ యువతికి పెళ్లి కుదిరింది.

ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ నిన్న ఉదయం ఆమె ఇంటికి వెళ్లాడు. తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే అప్రతిష్ట పాలు చేస్తానని, ఫోటోలు ఫేస్బుక్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించగా నిందితుడు ఉదయ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement