కోవూరు మండలకేంద్రంలోని ఎంఎస్‌ఆర్ కాలనీకి చెందిన యేకొల్లు కోటేశ్వరరావు(22) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నెల్లూరు(కోవూరు): కోవూరు మండలకేంద్రంలోని ఎంఎస్‌ఆర్ కాలనీకి చెందిన యేకొల్లు కోటేశ్వరరావు(22) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోటేశ్వరరావు నుంచి అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు మందలించటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.