సూట్ కేసులో యువకుడి మృతదేహం | youngster dead body found in suitcase | Sakshi
Sakshi News home page

సూట్ కేసులో యువకుడి మృతదేహం

Jun 5 2015 10:03 PM | Updated on Aug 1 2018 2:10 PM

సూట్ కేసులో యువకుడి మృతదేహం - Sakshi

సూట్ కేసులో యువకుడి మృతదేహం

వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం రెడ్డివారిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం సూట్ కేసులో కనిపించిన ఓ యువకుడి(32) మృతదేహం కలకలం సృష్టించింది.

సంబేపల్లె: వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం రెడ్డివారిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం సూట్ కేసులో కనిపించిన ఓ యువకుడి(32) మృతదేహం కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే..  కుంట తూముల వద్ద ఓ సూట్‌కేస్‌లోంచి దుర్వాసన వస్తుండటంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి రూరల్ సీఐ ప్రభాకర్ ఘటనా స్థలికి చేరుకుని సూట్ కేసును తెరవగా మృతదేహం కనిపించింది.

 

హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో ఉంచి కొద్ది రోజుల క్రితం ఇక్కడ పడేసి వెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ యువకుడు బ్రౌన్ రంగు ప్యాంటు, ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. మొహం గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉబ్బిపోయి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement