వీటీపీఎస్ కెనాల్లో విద్యార్థి మృతదేహం | Youngster dead body found at VTPS Canel | Sakshi
Sakshi News home page

వీటీపీఎస్ కెనాల్లో విద్యార్థి మృతదేహం

Nov 26 2014 7:17 AM | Updated on Aug 1 2018 2:10 PM

నగరంలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ లో ఓ యువకుని మృతదేహాం లభ్యమైంది.

విజయవాడ: నగరంలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో బుధవారం ఓ విద్యార్థి మృతదేహాం లభ్యమైంది. కాలువలోనుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఆదివారం అదృశ్యమైన కృష్ణవంశీగా పోలీసులు నిర్ధారించారు. కృష్ణవంశీ మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. కనిపించకుండా పోయిన తమ కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్నానానికి వెళ్లి కాలువలో పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement